లక్ష రీల్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప కపుల్ సాంగ్

by Prasanna |
లక్ష రీల్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప కపుల్  సాంగ్
X

దిశ, సినిమా : సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్‌ పుష్ప చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం రికార్డ్స్ క్రియోట్ చేయడమే కాకుండా.. పాత రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ పుష్ప మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అలాగే రెండో పాట సూసేకి అగ్గి రవ్వలా ఉంటాడే నా సామీ అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ తన స్టెప్పులతో రష్మికను ఆకట్టుకున్నాడు. గతంలో పుష్ప 1 పాటలో హుక్ స్టెప్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

పుష్ప పార్ట్ 1 లో శ్రీవల్లి పాటల స్టెప్పులు, సామీ-సామి స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో మనకి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాట పాపులర్‌ అయింది. ఇప్పుడు ది కపుల్ సాంగ్ అయితే లక్ష కి పైగా రీల్స్ వచ్చాయి. ఇన్‌స్టా లో కొత్త రికార్డు క్రియోట్ చేసింది. ఇది చూసిన బన్నీ అభిమానులు మా అల్లు అర్జున్ పాట అంటే ఈ మాత్రం ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story