మరికొన్ని గంటల్లో రివీల్ చేయనున్న “పుష్ప 2” అప్డేట్

by Prasanna |
మరికొన్ని గంటల్లో రివీల్ చేయనున్న  “పుష్ప 2” అప్డేట్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా సీక్వెల్ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ వస్తున్నట్టుగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

అయితే, ఈ రోజు సాయంత్రం 04:05 నిముషాలకు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు . దీనితో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప 2 టీజర్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ అవైటెడ్ అప్డేట్ మరికొన్ని గంటల్లో రివీల్ చేయనున్నారు. పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా పుష్ప 2 అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ ఫిక్స్ చేశారు.

Advertisement

Next Story