- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాయ్ ఫ్రెండ్‌తో దర్శన మిచ్చిన పునర్నవి..హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ(పోస్ట్)
దిశ, సినిమా: ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 2019లో బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ భామ రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్‌గా మూవ్ అవుతూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ షో తర్వాత పలు సిరీస్ లో నటించి చదువు నిమిత్తం అమెరికా వెళ్ళిపోయింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
గతంలో పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్ లో ఉందని రూమర్స్ రాగా వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు. కాగా తాజాగా పునర్నవి తన సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో దిగిన ఫోటో పోస్ట్ చేసి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే ఈ ఫొటోలో వాళ్ళు వెనక్కి తిరిగి కూర్చున్న ఫోటోని పోస్ట్ చేయడంతో ముఖాలు కనిపించట్లేదు. ఆ అబ్బాయి పునర్నవిని దగ్గరికి హత్తుకొని కూర్చోగా.. పునర్నవి ఆ అబ్బాయిపై చెయ్యి వేసుకుని కూర్చుంది.
అలాగే నా ఒక్కగానొక్క లవ్ కి హ్యాపీ బర్త్ డే అంటూ క్యాప్షన్ ని జత చేసి పోస్ట్ చేసింది. దీంతో అతను పునర్నవి బాయ్ ఫ్రెండ్ అని అందరూ అనుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే లవ్ అని రాయడంతో పాటు చాలా క్లోజ్ గా దిగిన ఫోటో షేర్ చేయడంతో పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఇతనే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.