నెట్టింట దుమారం రేపుతోన్న వార్త.. లైంగిక వేధింపులకు గురైన స్టార్ హీరోయిన్?

by Anjali |
నెట్టింట దుమారం రేపుతోన్న వార్త.. లైంగిక వేధింపులకు గురైన స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా: అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ప్రియమణి. తన అందం, డాన్స్, నటన తో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ హీరోయిన్ కూడా పలు హీరోయిన్ల లాగా లైంగిక వేధింపులకు గురైందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.‘‘ప్రియమణి కెరీర్ స్టార్టింగ్ లో ఓ డైరెక్టర్ తన బెడ్ రూమ్ లోకి డైరెక్ట్ గా వచ్చేశారట.

దీంతో ఒక్కసారిగా ప్రియమణి అరిచి గోల చేయడంతో అతడు బెడ్ రూమ్ లోంచి బయటికి వెళ్లాడట. అలాగే ఓ సినిమా షూటింగ్ పనిమీద చిత్ర బృందంతో కలిసి ఫ్లైట్ లో ప్రయాణిస్తుండగా.. అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ తన పక్కనే కూర్చున్నారట. పక్కనున్న ఈ హీరోయిన్ ను తాకుతూ అసభ్యకరంగా బిహేవ్ చేశాడట. అంతేకాకుండా మీతో కలిసి వెకేషన్‌కు రావాలని ఉందని అన్నాడట.

తర్వాత ఒక బ్లాంక్ చెక్కు తీసి ఇచ్చి ప్రియమణికి ఇచ్చాడట. తర్వాత ఈ బ్యాంక్ చెక్ ఎందుకు ఇచ్చారని నటి అడగ్గా.. మీరు నాతో పాటు రావాలని అన్నాడట. దీంతో ప్రియమణికి కోపం వచ్చి అతడిని తిట్టిందట. అలాగే ఓ తమిళ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట. ప్రియమణిని చాలా వేధించాడట. ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట మాత్రం జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed