- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియమణి భామకలాపం 2 ట్రైలర్ రిలీజ్? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటించిన భామాకలాపం ట్రైలర్‌ను ఆహా రిలీజ్ చేసింది. పార్ట్ వన్ కంటే బెటర్‌గా ఈ ట్రైలర్ ఉన్నట్లు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డేంజరస్ వైఫ్ అనుపమ (ప్రియమణి) తాను యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఘుమఘుమ అనే హోటల్ పెట్టాలని అనుకుంటుంది. ఇక ఈ విషయాన్ని భర్తకు చెబుతుంది. దీంతో భామాకలాపం 2 ట్రైలర్ షురూ అవుతోంది.
ఈ తరుణంలోఓ కుకింగ్ ఐడల్ షోకు అనుపమ సెలెక్ట్ అవుతారు. ఆ పోటీలో గెలిచిన వారికి బంగారు కోడిపుంజు బహుమతిగా ఉంటుంది. అయితే, దాన్ని దొంగలించేందుకు ఓ మాఫియా గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. ఈక్రమంలోనే తన హోటల్లో ఓ శవం దొరుకుతుంది. తాను ఆ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది.ఆమెకు కీలక పాత్రలో నటించిన సీరత్ కపూర్ పాత్రకు ఉన్న లింకేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న ఆహాలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న ‘భామాకలాపం 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన భామాకలాపం మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో దీనికి సీక్వెల్‌గా భామాకలాపం2 వస్తోంది. ఇది ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ఫిబ్రవరి16న స్ట్రీమింగ్‌కు రానుంది.