సింపుల్ చీరలో చిలిపి ఫోజులిచ్చిన యంగ్ బ్యూటీ.. కిర్రాక్ ఫొటో షూట్ వైరల్

by Anjali |
సింపుల్ చీరలో చిలిపి ఫోజులిచ్చిన యంగ్ బ్యూటీ.. కిర్రాక్ ఫొటో షూట్ వైరల్
X

దిశ, సినిమా: ‘ఓరు అదారు లవ్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కుర్ర హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఇందులో ఈ బ్యూటీ తన ప్రియుడికి కన్ను కొట్టే సన్నివేశం యువత గుండెల్లో గిలిగింతలు పెట్టించిందనడంలో అతిశక్తిలేదు. ఈ సీనే ప్రియా ప్రకాష్‌కు యువతలో మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. తర్వాత ఈ యంగ్ హీరోయిన్‌కు ‘‘చెక్, తనహా (మేలే శూన్యాగాషం" పాటలో), ఇష్క్, 4 ఇయర్స్, లైవ్, కొల్ల, సుభద్రాహరణం(షార్ట్ ఫిల్మ్), బ్రో’’ వంటి తెలుగు, మలయాళం చిత్రాల్లో అవకాశం దక్కించుకుని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఓ స్థానం సంపాదించుకుంది. ఇదిలా ఉండగా..

తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ క్యూట్ ఫొటో షూట్ చేసింది. శారీ కట్టుకుని సింపుల్‌గా రెడీ అయి.. అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. తల ఓ వైపు ఆనించి, చిలిపి నవ్వులు నవ్వుతూ స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోన్న ప్రియా ప్రకాష్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు వీక్షించిన నెటిజన్లు.. ‘వావ్ ఫస్ట్ పిక్ స్టన్నింగ్ హాటీ, స్టన్నింగ్ ఫొటో షూట్, లుకింగ్ గార్జియస్’ అంటూ లవ్ సింబల్స్ జోడించి ఈ బ్యూటీ అందంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story