- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చట్టాన్ని అతిక్రమిస్తే రౌడీ షీట్లు.. సీఐ నిరంజన్ రెడ్డి
దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి సర్కిల్ పరిధిలో గల ప్రతి ఒక్కరికి, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఐ నిరంజన్ రెడ్డి. రాబోయే నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు సంబరంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 31 రోజున నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకునే వాళ్లు చట్టాన్ని అతిక్రమిస్తే వారిని రౌడీ షిటర్లుగా గుర్తించి కేసులు నమోదు చేస్తామని సీఐ నిరంజన్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు. ఆదివారం తన ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చట్టరీత్యా నేరమని ఆయన తెలిపారు. ఒక్కసారి రౌడీ షీటర్లుగా కేసులు నమోదైతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇదిలావుంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు నూతన సంవత్సరాన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సీఐ నిరంజన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహింపట్నం ఎస్ఐలు కిరణ్ కుమార్, రాజు, అనిల్ లు పాల్గొన్నారు.