Phone Tapping Case : పురోగతిలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ : డీజీపీ జితేందర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-29 09:59:08.0  )
Phone Tapping Case : పురోగతిలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ : డీజీపీ జితేందర్
X

దిశ, వెబ్ డెస్క్ : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణ(Investigation) కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేందర్ (DGP Jitender) స్పష్టం చేశారు. కేసులో ఇతర దర్యాప్తు సంస్థల సహకారం అవసరమవ్వడంతో కేసు విచారణ ప్రక్రియలో కొంత జాప్యం నెలకొందన్నారు. విచారణను వేగవంతం చేసే దిశగా ఈ కేసులో విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించేందుకు సీబీఐకి లేఖ రాశామని తెలిపారు. అమెరికా నుంచి ఇండియాకు వారిని రప్పించాలంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ జరుగుతుందని, ఇప్పటికే ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. రాజకీయ నాయకులకు నోటీసులు అవసరం మేరకు జారీ అవుతాయని, ఇప్పటికే కొందరిని విచారించిన సంగతి తెలిసిందేనన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే , మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణిత్ రావులను అరెస్టు చేశారు. కేసు నమోదు విషయమై తెలుసుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ చానల్ అధినేత శ్రవణ్ రావులు అమెరికా వెళ్లిపోయారు. కేసు పురోగతికి వారిద్ధరు కీలకం కావడంతో వారిని ఇండియా రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తిప్పలు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed