రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ధోనీ.. ఈ సీజన్ తర్వాత రిటైర్ అవుతాడా?.. ధోనీ ఏమన్నాడంటే?

by Harish |
రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ధోనీ.. ఈ సీజన్ తర్వాత రిటైర్ అవుతాడా?.. ధోనీ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్‌లో మాత్రం అలరిస్తున్నాడు. అయితే, గత రెండు మూడు ఐపీఎల్ సీజన్లుగా అతని రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈ సీజన్‌కు ముందు నుంచే మాహీ కచ్చితంగా ఈ సారి వీడ్కోలు పలుకుతాడంటూ వార్తలు వచ్చాయి. శనివారం ఢిల్లీ, చెన్నయ్ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు రావడంతో మాహీకి అదే చివరి మ్యాచ్ అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ధోనీ మౌనం వీడాడు. తన రిటైర్మెంట్‌ వస్తున్న వార్తలపై ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించాడు.

ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించట్లేదని పరోక్షంగా బదులిచ్చాడు. అలాగే, రిటైర్మెంట్ తన ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ‘నేను ఇంకా ఐపీఎల్ ఆడుతున్నా. నా వయసు 43. ఈ సీజన్ పూర్తయ్యే సరికి జూలైలో నాకు 44 ఏళ్లు వస్తాయి. రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకా 10 నెలల సమయం ఉంది. మరో ఏడాది ఆడాలా?వద్దా? అని నిర్ణయించుకుంటా. అయితే, ఆ నిర్ణయం కూడా నేను తీసుకోను. నేను ఆడగలనా?లేదా? అనేది నా శరీరం డిసైడ్ చేస్తుంది.’ అని ధోనీ చెప్పాడు. కాగా, ఈ సీజన్‌లో 43 ఏళ్ల వయసులోనూ ధోనీ పర్వాలేదనిపిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 0, 30, 16, 30 రన్స్ చేశాడు. అలాగే, కీపింగ్ నైపుణ్యాలతో కూడా ఆకట్టుకున్నాడు.




Next Story

Most Viewed