Shamshabad: విమానంలో మహిళ వీరంగం.. కేసు నమోదు

by srinivas |   ( Updated:2024-12-29 09:34:39.0  )
Shamshabad: విమానంలో మహిళ వీరంగం.. కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండిగో విమానం(Indigo Flight)లో ఓ మహిళ(woman) వీరంగం సృష్టించారు. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించారు. అయితే సిబ్బంది నచ్చచెప్పేందుకు యత్నించారు. కానీ ఆమె ఎంతకీ తగ్గలేదు. మరింత రెచ్చిపోయి ప్రయాణికులను బూతులు తిడుతూ హల్ చల్ చేశారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో జరిగింది. ఇండిగో విమానం శంషాబాద్ నుంచి ముంబై(Mumbai)కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే మద్యం సేవించిన ఓ మహిళ విమానంలోకి ఎక్కి రచ్చ రచ్చ చేశారు. తోటి ప్రయాణికులను తిడుతూ వీరంగం సృష్టించారు. దీంతో ఆమెను CISF పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story