- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి
దిశ, మంగపేట : రబీ పంట నాటు కోసం త్రీ ఫేజ్ మోటారుకు అగ్రికల్చర్ కనెక్షన్ ఇచ్చేందుకు ట్రాన్స్ ఫారం వద్దకు వెళ్లగా ఎల్టీ లైనుకు వైరు తగిలించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై గిరిజన రైతు జవ్వాజి రామకృష్ణ(35) చేనులో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని కోమటిపల్లి బూర్కబందాల(కట్టుకాల్వ) ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోమటిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన రామకృష్ణ తన పంట పొలంలో రబీ నాటు వేసేందుకు పొలానికి నీరు పెట్టడానికి ఉదయం వచ్చాడు. ఈ క్రమంలో మోటారుకు కరెంటు రాకపోవడంతో సమీపంలోని ట్రాన్స్ ఫారం ఎల్టీ లైనుకు మోటారు వైర్లు తగిలించే క్రమంలో 11/33 కెవి లైను ఎర్త్ కు విద్యుత్ సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయాన్ని పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మృతుడికి భార్య పుష్పలత, ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషయమై మంగపేట లైన్ ఇన్స్పెక్టర్ మధును వివరణ కోరగా మృతుడు చనిపోయినట్లు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించమని తెలిపారు. త్రీ ఫేజ్ మోటారు వైర్లు తగిలించే క్రమంలోనే విద్యుదాఘాతానికి గురైనట్లు గుర్తించినట్లు తెలిపారు. రైతులు అగ్రికల్చర్ మోటార్లకు వైర్లు తగిలించుకునేటప్పుడు తమను సంప్రదించి ఎల్ సీ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.