- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్ఎంపీ వైద్యుడు అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు..
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్లక్ష్య వైద్యంతో మహిళ మృతికి కారణం అయిన ఆర్ఎంపీని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎంపీలు తెలిసీ తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీస వైద్యం తెలియని ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం సముద్రలింగపూర్ తుర్కషి కాలానికి చెందిన మహిళ మరణానికి కారణం అయిన ఆర్ఎంపీ జజ్జరి దేవేందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్లారెడ్డిపేట్ మండలం తుర్కషి కాలనీ, సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసింబి (30) అనే మహిళకు గురువారం రోజున జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లారు. కాగా ఆర్ఎంపీ దేవేందర్ ఖాసింబిని పరిశీలించి ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇవ్వగా మరునాడు జ్వరం తగ్గకపోయేసరికి మరల ఆర్ఎంపీ వద్దకు తీసుకొని వెళ్లారు. జ్వరంలో ఖాసింబికి గ్లూకోజ్ లు పెట్టగా ఖాసీం బి స్పృహ కోల్పోయింది. దీంతో బంధువులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో ఖాసిం బి భర్త మహమ్మద్ అజిమ్ ఆర్ఎంపీ నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేట్జిన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎల్లారెడ్డిపేట్ ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేయగా ఎల్లారెడ్డిపేట్ సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేసి ఆర్ఎంపీ దేవేందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారని డీఎస్పీ తెలిపారు.
ప్రజలు అనారోగ్యంతో ఉన్నపుడు కనీస వైద్య తెలియని ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ప్రభుత్వ వైద్య సదుపాయాలు, అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలన్నారు. జిల్లాలో ఉన్న ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలే తప్ప క్లీనిక్ ల పేరుతో తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకవస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని డీఎస్పీ హెచ్చరించారు.