మూడు రోజులుగా తాగుతూ.. నగ్నంగా కనిపించిన ప్రభాస్ ఫ్రెండ్.. వైరల్ న్యూస్

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-03 05:08:03.0  )
మూడు రోజులుగా తాగుతూ.. నగ్నంగా కనిపించిన ప్రభాస్ ఫ్రెండ్.. వైరల్ న్యూస్
X

దిశ, సినిమా :‘సలార్’లో ప్రభాస్ ఫ్రెండ్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘ది గోట్ లైఫ్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. దాదాపు 16ఏళ్లపాటు ఈ మూవీ కోసం వర్క్ చేసిన ఆయన.. ఫిల్మ్ ఆడియన్స్‌కు రీచ్ అయ్యేందుకు స్లీప్ లెస్ ప్రమోషన్స్ కూడా చేశాడు. ఈ క్రమంలో ఆయన కమిట్మెంట్, హార్డ్ వర్క్ గురించి సినిమాటోగ్రాఫర్ సునిల్ కేఎస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


ఈ చిత్రంలో న్యూడ్ సీన్ చేసేందుకు పృథ్వీ చాలా హోమ్ వర్క్ చేసినట్లు తెలిపాడు. నీరసంగా కనిపించేందుకు మూడు రోజులు భోజనం చేయలేదని.. డైరెక్టర్ బ్లెస్సీ చెప్పినట్లుగా వోడ్కా మాత్రమే తాగాడని వివరించాడు. ఆయన మాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన జెమ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. కాగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన సినిమా ఇప్పటికే రూ. 50 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

Advertisement

Next Story

Most Viewed