మత్తెక్కించే కళ్ళతో రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న ప్రేమమ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్!

by Kavitha |
మత్తెక్కించే కళ్ళతో రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న ప్రేమమ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్!
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మడోన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.‘ ప్రేమమ్’ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమానే హిట్ కావడంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత తెలుగులో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అడ్వకేట్‌గా కనిపించి అలరించింది. అయితే సినిమాల్లోకి వచ్చి దాదాపు దశాబ్దం కావోస్తున్న ఆ భామ నటించిన మొత్తం సినిమాలు 15. కాగా తెలుగు సినిమాలు 3 మాత్రమే చేసింది. ఇటీవల తమిళంలో వచ్చిన ‘లియో’ సినిమాలో విజయ్‌తో కలిసి ఎలీసా దాస్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న.. అవకాశాలు మాత్రం అనుకున్న రీతిలో రావడం లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తుంది. అదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతుంది. ఈ క్రమంలో ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ వేసుకుని ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు మత్తెక్కించే కళ్ళతో ముద్ద మందారం లాగా ఉన్నావు అని.. స్ట్రాబెర్రీలాగా గార్జీయస్‌గా ఉన్నావంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story