Prabhu Deva: ప్రభుదేవాకు రెండో పెళ్లి.. మూడేళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-19 07:25:12.0  )
Prabhu Deva: ప్రభుదేవాకు రెండో పెళ్లి.. మూడేళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ సినిమాలో స్టార్ కొరియోగ్రఫర్‌గా, మంచి నటుడిగా, డైరెక్టర్‌గా ప్రభుదేవా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అయితే ప్రభుదేవా మొదటి భార్య రామలతా. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరి జీవితంలోకి నయన తార ఎంట్రీ ఇచ్చింది. ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుదేవా కోసం నయనతార హిందూ మతంలోకి మారింది. పెళ్లి కూడా అవుతుందనుకున్న సమయంలో మొదటి భార్య విడాకులకు ఒప్పుకోకపోవడం, నయనతారను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో వీరి ప్రేమకు పుల్ స్టాప్ పడింది.

2011లో రామలతకు ఇండియన్ మైకెల్ జాక్సన్ విడాకులు ఇచ్చారు. అయితే ప్రభుదేవా కరోనా సమయంలో ఎవరికి తెలియకుండా హిమానీని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం డ్యాన్స్ మాస్టర్, ప్రభుదేవా తమ్ముడు రాజుసుందరం కారణంగా బయటకు రావడం ప్రస్తుతం సంచలనం గా మారింది. కొన్ని రోజుల క్రితం ప్రభుదేవా పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియోలో హిమానీ మాట్లాడుతూ.. ప్రభుదేవాను మ్యారేజ్ చేసుకోవడం తన లక్ అని చెప్పింది. ఇటీవల ఈ జంట తిరుమలలో అడుగులో అడుగు వేస్తూ సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed