Prabhas: హను రాఘవపూడి సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్

by Prasanna |   ( Updated:2024-09-23 11:46:11.0  )
Prabhas: హను రాఘవపూడి సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్
X

దిశ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా, హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రాబోతుందన్న విషయం మనకీ తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ప్రేమ కథలతో మంచి గుర్తింపు పొందిన ఈ డైరెక్టర్ తో ప్రభాస్ చేస్తున్న ఫస్ట్ మూవీ అవ్వడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ఓపెనింగ్ పూజా చాలా గ్రాండుగా జరిగింది. ఈ సినిమా లుక్ టెస్ట్ కోసం ప్రభాస్ ముంబైకు వెళ్లాడని తెలిసిన సమాచారం.

సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబందించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీనిలో డార్లింగ్ కొత్త లుక్ ను చూసి మా అన్న సూపర్ అంటూ వీడియోను చాలా మందికి షేర్ చేస్తున్నారు. అయితే, ప్రభాస్ మాస్క్ పెట్టుకొని తన ఫేస్ ను బాగానే కవర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మొదటి షెడ్యూల్ తమిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రుపుకుంటుంది. ఇక అక్టోబర్ లో హను రాఘవపూడి, ప్రభాస్ సినిమా షూట్ మొదలవుతుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

Advertisement

Next Story