నెట్టింట వైరల్ అవుతున్న ప్రభాస్ లేటెస్ట్ లుక్ (వీడియో).. అంకుల్ అనేస్తున్న నెటిజన్లు!

by Hamsa |   ( Updated:2024-04-22 12:32:39.0  )
నెట్టింట వైరల్ అవుతున్న ప్రభాస్ లేటెస్ట్ లుక్ (వీడియో).. అంకుల్ అనేస్తున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ డార్లింగ్ సోషల్ మీడియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కిఏడి 2898’ చేయబోతున్నాడు. అలాగే మారుతితో రాజా సాబ్ డీలక్స్ అనే మూవీ చేస్తున్నాడు. అయితే కల్కి రిలీజ్ వాయిదా పడటంతో ప్రభాస్, మారుతి తెరకెక్కించనున్న సినిమా సెట్‌లో జాయిల్ అయినట్లు తెలుస్తోంది.

సలార్ తర్వాత కనిపించని ప్రభాస్ మళ్లీ రాజాసాబ్ సెట్‌లో వెరైటీగా కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇందులో సరికొత్త హెయిర్ కట్‌తో, గుబురు గడ్డంతో క్యాప్ పెట్టుకుని వింటేజ్ లుక్‌తో కనిపించాడు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు అంకుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం మాటలు లేవు సూపర్‌గా ఉన్నావంటూ హార్ట్ ఎమోజీని షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story