Prabhas: ప్రభాస్ ఆ విషయంలో మారకపోవడానికి రాజమౌళే కారణమా?

by Prasanna |   ( Updated:2023-04-21 13:49:22.0  )
Prabhas: ప్రభాస్ ఆ విషయంలో మారకపోవడానికి రాజమౌళే కారణమా?
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో ప్రభాస్ ఎక్కువ సిగ్గు పడుతుంటాడు.అందుకే మీడియా ముందుకు ఎక్కువ రాడు. పబ్లిక్ వేడుకల్లో అయితే అస్సలే పాల్గొనరు. తనకు ఎంత టాలెంట్ ఉన్నా సిగ్గు, బిడియం వల్ల ఒక్కోసారి ఆగిపోతున్నారు. దీనికి కారణం రాజమౌళి అని ..సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఛత్రపతి సినిమా చేసే సమయంలో ఒక సీన్లో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్ నిల్చొని ఉంటారు. వాళ్లలో ధైర్యం నింపేలా ప్రభాస్ ఒక భారీ డైలాగ్ చెప్పాలి.అప్పుడు ఒక పక్క వర్షం ఎఫెక్ట్, రాత్రి పూట చలి… దీంతో రాజమౌళిని ప్రభాస్ ఓ రిక్వెస్ట్ చేశాడట. సార్ నేను అంత పెద్ద డైలాగ్ చెప్పలేను. చిన్నగా చెప్తాను. మీరు షాట్ ఒకే చేసుకోండి అని కోరాడట.. ప్రభాస్ మాటను కాదన లేక ఓకే చేశాడట. అప్పటి నుంచి మొహమాటం మరి ఎక్కువైందట.. ఛత్రపతి సినిమా అప్పుడే ప్రభాస్‌ని కట్టడి చేసి ఉంటే ఈ రోజు ఇలా ఉండే వాడు కాదని జక్కన్న పై మండిపడుతున్నారు.

Also Read...

బిగ్ న్యూస్: RRR టీమ్‌తో అమిత్ షా భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కేంద్రమంత్రి టూర్!

Advertisement

Next Story