నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ఫొటో వైరల్.. ఆ సమస్య వల్లేనా!

by Hamsa |   ( Updated:2024-03-12 06:52:34.0  )
నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ఫొటో వైరల్.. ఆ సమస్య వల్లేనా!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ మూవీతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ డిలక్స్, కల్కిఏడీ2898 వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ప్రభాస్ గత కొద్ది కాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. సలార్ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో పాల్గొనకుండా సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు.

యూరప్‌లో చికిత్స చేయించుకుని అక్కడే నెలపాటు రెస్ట్ తీసుకున్నాడు. ఇక ఇటీవల కల్కి రొమాంటిక్ సాంగ్ కోసం ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా, ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో డార్లింగ్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దిగుతున్నట్లు కనిపించాడు. ఆ ఫొటోలో ప్రభాస్ చాలా ఇబ్బందిగా, జాగ్రత్తగా ఫ్లైట్ దిగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుండటంతో ప్రభాస్‌కు మోకాలి నొప్పి తగ్గినట్లు లేదనుకుంటా అందుకే సరిగ్గా నడవలేకపోతున్నారంటే కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed