- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొత్తానికి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం చెప్పేసిన రెబల్ స్టార్.. ఫ్యాన్స్‌కు గట్టిగానే క్లాస్ ఇచ్చాడుగా!
దిశ, సినిమా: బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సుపరిచితమే. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ హీరో పెళ్లి చేసుకుంటే చూడాలని తమ కుటుంబ సభ్యులతో సహా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీలో యంగ్ హీరోలు సైతం పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో ఎంతో హ్యాపీగా ఉన్నారు.
సీనియర్ హీరో అయిన రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వివాహం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్నాడు. తరచూ పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తాడు. రీసెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్ పెళ్లైనట్లు ఆల్రెడీ ఓ బాబు కూడా జన్మించినట్లు ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. కానీ వీటిపై రెబల్ స్టార్ గానీ, అనుష్క గానీ స్పందించలేదు. పలు హీరోయిన్లతో కూడా ప్రభాస్ ప్రేమలో ఉన్నాడంటూ టాక్ వినిపిస్తుంది.
అయితే తాజాగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పెళ్లి పై ఇలాంటి కామెంట్లు చేశాడని జనాలు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ‘‘నా అభిమానులు నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నేను వివాహం చేసుకున్న తర్వాత నాకు ఆమెకు ఏమైనా డిస్టబెన్స్ వస్తే ఫాన్స్ క్లియర్ చేయలేరు కదా? ఎందుకండి ఈ పెళ్లి.. లొల్లి. ఉన్నన్ని రోజులు నేను ఇలానే ఉందామని అనుకుంటున్నా’’ అని ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి పెళ్లి ఊసెత్తకుండా గట్టిగా సమాధానం ఇచ్చాడట.
Read More..
పెళ్లై రెండేళ్లైనా నయనతారకు ఆ కోరిక తీరలేదా? అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
- Tags
- Prabhas