Prabhas: టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ప్రభాస్

by Prasanna |   ( Updated:2024-09-18 14:46:50.0  )
Prabhas: టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయలేని రికార్డు  సృష్టించిన ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి .. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగాడు. ఈ హీరో ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా, మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఏకంగా ఐదు మూవీలు రూ . 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంత వరకు ఏ హీరో కూడా ఈ రికార్డు టచ్ చేయలేదు. బాహుబలి , బాహుబలి2 , సాహో , సలార్, కల్కి 2898 ఏడీ మూవీస్ తో ప్రభాస్ కు ఈ ఘనత దక్కింది.

ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ అయినా రూ. 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు రూ .150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించాయి. ప్రభాస్ రికార్డ్స్ ను ఇక ఏ హీరో కూడా బ్రేక్ చేయలేరని మాత్రం చెప్పొచ్చు.

Read More..

Devara Movie: రేపే ‘దేవర’ ఆయుధ పూజ.. ఏ రేంజ్ లో మెప్పిస్తాడో..?

Advertisement

Next Story

Most Viewed