ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. సీఎం సంతాపం

by Anjali |   ( Updated:2023-06-27 02:30:04.0  )
ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. సీఎం సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ యూట్యూబర్, కమెడియన్ ‘దేవరాజ్ పటేల్’ మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తన మిత్రుడితో కలిసి దేవరాజ్ బైక్‌పై వెళ్తుండగా.. అతి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవరాజ్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతని స్నేహితులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దేవరాజ్ మరణవార్త తెలిసిన అభిమానులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు. స్టార్ సెలబ్రిటీలకు దేవరాజ్ మరణవార్త తెలిసి దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ ఘటనపై ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. ‘‘మనందరినీ నవ్వించి, “దిల్ సే బురా లగ్తా హై” తో కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన దేవరాజ్ ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టాడు. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను కనభర్చి, మనల్ని వదలి వెళ్లడం బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అంటూ ట్వీట్‌లో దేవరాజ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

Also Read: కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ నోట్.. వైరల్ అవుతున్న ఫోటో?

Advertisement

Next Story

Most Viewed