చేతిలో కొబ్బరికాయ, నెత్తిలో మల్లెపూలు: పూజ ఏ పూజ చేస్తోంది!

by Disha News Desk |
చేతిలో కొబ్బరికాయ, నెత్తిలో మల్లెపూలు: పూజ ఏ పూజ చేస్తోంది!
X

దిశ , సినిమా: యంగ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నటి.. గతేడాది ఓ ఇంటికి యజమానురాలైన విషయం తెలిసిందే. కాగా ముంబైలో సొంతిళ్లు కొనుక్కుని నేటితో సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా తన గృహప్రవేశానికి సంబంధించిన పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన మల్లెపూలు, చేతిలో కొబ్బరికాయ పట్టుకుని పద్ధతిగా కూర్చున్న పూజ.. తన కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు కనిపించింది. అంతేకాదు 'ఈ అద్భుతమైన రోజు నేటితో సంవత్సరం పూర్తిచేసుకుంది. మీ కలలను నెరవేర్చుకునేందుకు మిమ్మల్ని మీరు నమ్ముతూ కష్టపడి పనిచేయండి. అప్పుడు ఈ ప్రపంచం మీతో ప్రేమలో పడుతుంది' అంటూ రాసుకొచ్చింది.

Advertisement

Next Story