యంగ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూజా హెగ్డే.. అఫిషియల్ అనౌన్స్ మెంట్..

by Sujitha Rachapalli |
యంగ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూజా హెగ్డే.. అఫిషియల్ అనౌన్స్ మెంట్..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ పూజా హెగ్డే ఒకప్పుడు మూవీ సైన్ చేసిందంటే పక్కా హిట్ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఆ తర్వాత ఆ ఒపీనియన్ మారిపోయింది. ఆమె సినిమా చేస్తే డిజాస్టర్ అనే టాక్ వచ్చేసింది. దీంతో ఆఫర్లు కరువయ్యాయి. వచ్చిన ఛాన్స్ లు మిస్ అయ్యాయి. దీంతో ఆమె చేతిలో ఒక్క బాలీవుడ్ సినిమా తప్పితే మరోటి లేదు. కానీ తాజాగా టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చిందని సమాచారం. మొత్తానికి అవకాశాలు తగ్గిపోవడంతో ఈ బ్యూటీ జీవితంలో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇండస్ట్రీని వదిలేసి చక్కగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని డిసైడ్ అయినట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వెలువడింది.

హిందీ సీరియల్ హీరో రోహన్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన పూజ.. ఇప్పటికే చాలా సార్లు ఆయనతో కలిసి ఉన్నప్పుడు మీడియా కంటపడింది. అయితే ఇప్పుడు ఈ అబ్బాయిని కుటుంబానికి పరిచయం చేసిన అమ్మడు.. పెళ్లికి ఒప్పించినట్లు తెలుస్తుంది. బుట్టబొమ్మ మాటకు కట్టుబడి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Advertisement

Next Story

Most Viewed