Rajtharun-Lavanya case: లావణ్యతో రాజ్ తరుణ్ సహజీవనం నిజమే.. కేసులో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

by Prasad Jukanti |   ( Updated:2024-09-06 16:16:09.0  )
Rajtharun-Lavanya case: లావణ్యతో రాజ్ తరుణ్ సహజీవనం నిజమే.. కేసులో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హీరో రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్ లో తాజాగా మరో ట్విస్ట్ నమోదు అయింది. ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడే అని పోలీసులు పేర్కొన్నారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు. లావణ్య చెబుతున్న కొన్ని విషయాలు నిజమేనని, ఈ ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. అలాగే ఒకే ఇంట్లో కూడా ఉన్నారని వివరించారు. కేసు విచారణ భాగంగా లావణ్య ఇంటిని కూడా సందర్శించి పలు కీలక ఆధారాలు సేకరించారు. మరో వైపు ఈ కేసులో రాజ్ తరుణ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed