చిరంజీవి మీద విషప్రయోగం.. ఆసుపత్రిలో రెండ్రోజులు ట్రీమ్‌మెంట్.. ఆందోళనలో ఫ్యాన్?

by Anjali |
చిరంజీవి మీద విషప్రయోగం.. ఆసుపత్రిలో రెండ్రోజులు ట్రీమ్‌మెంట్.. ఆందోళనలో ఫ్యాన్?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. లెక్కలేనన్నీ సినిమాల్లో నటించి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. తన నటన, డాన్స్‌తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇటీవల ఆయన చేసిన సేవలను గుర్తించి.. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ అవార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంతటి గుర్తింపు దక్కించుకున్న మెగాస్టార్‌పై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరు చెన్నైలో నటనలో ట్రైనింగ్ తీసుకుంటోన్న సమయంలో పునాది రాళ్లు, తర్వాత మరణమృదంగం ఇలా వరుస సినిమాల్లో అవకాశలొచ్చాయట. అయితే మరణమృదంగం షూటింగ్ జరుగుతుండగా.. ఓ అభిమాని సెట్స్‌ కు వచ్చి.. తన బర్త్ డే రోజున కేక్ కట్ చేయించి తినిపించాలని ఫోర్స్ చేశాడట. మెగాస్టార్ వద్దంటున్నా బలవంతం చేశాడట. కాసేపయ్యాక చిరు పెదాలు రంగు మారిపోయాయట. వెంటనే చెన్నైలోని ఓ హస్పిటల్‌కు వెళ్లి చిరు రెండు రోజులు ట్రీట్‌మెంట్ తీసుకోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారట. చిరుపై విష ప్రయోగం జరిగిందని డాక్టర్లు చెప్పారట. మరీ ఈ విషయం ఎంతవరకు నిజయో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ ఫ్యాన్స్ చిరంజీవిని చంపాలని చూసిన వ్యక్తిపై మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed