దయచేసి పుకార్లు పుట్టించకండి.. బాధగా ఉందంటూ డైరెక్టర్ ఎమోషనల్ నోట్

by Hamsa |   ( Updated:2024-09-05 12:54:39.0  )
దయచేసి పుకార్లు పుట్టించకండి.. బాధగా ఉందంటూ డైరెక్టర్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబోలో తెరకెక్కిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే దీనికి టైటిల్ ఫిక్స్ చేయనప్పటికీ ఓదెల-2 అని పిలుస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై గత కొద్ది రోజుల నుంచి ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, మూవీ టీమ్ ఓ అలర్ట్ నోట్‌ను విడుదల చేస్తూ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దానిని శ్రీకాంత్ ఓదెల కూడా పెట్టాడు. ‘‘ఎన్నో మిలియన్ల మంది ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో పని చేసే కొంతమంది వ్యక్తుల కల సినిమా.

అలాంటి మూవీ ప్రీ ప్రొడక్షన్ నుంచి పూర్తి అయ్యే వరకు ఎంతో ప్రేమతో వర్క్ చేస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా సరే బెస్ట్‌గా ఇవ్వాలనే జాగ్రత్తగా పనిచేస్తుంటాం. ఓదెల-2 కూడా అలాంటిదే ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. సోషల్ మీడియాలో వస్తున్న లీకులు, రూమర్స్ వల్ల అందరూ దీని గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే బాధగా ఉంది. ఇలాంటి కథనాలు మా ఉత్సాహానికి భంగం కలిగిస్తుంటాయి. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి. మా సినిమా గురించి వచ్చిన వార్తలన్నీ నిజాలు కాదు. అప్‌డేట్స్ ఉంటే మేము అధికారికంగా ప్రకటిస్తాం’’ అని ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.


Click Here For Twitter Link



Advertisement

Next Story

Most Viewed