Khushi చిత్రం నుంచి ‘పెళ్లామా’ సాంగ్ ప్రోమో విడుదల..!

by Anjali |   ( Updated:2023-08-25 16:21:04.0  )
Khushi చిత్రం నుంచి ‘పెళ్లామా’ సాంగ్ ప్రోమో విడుదల..!
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. హారోయిన్ సమంత జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సెప్టెంబరు 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ నుంచి లేటెస్ట్‌గా మేకర్స్ 5వ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. కాగా పబ్‌లో వచ్చే ఈ సాంగ్..‘‘కాశ్మీర్‌లో ఫస్ట్ టైం తనని చూసిన ముందెనుక చూడకుండా మనసిచ్చినా.. బాబు మాట పక్కనెట్టి బయటికి వచ్చినా.. లగ్గమెట్టీ కాపురాన్ని స్టార్ట్ చేసిన’’ అంటూ రాహూల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ పాట చివర్లో ఓసి పెళ్లామా.. అని వచ్చే లైన్‌తో.. వాహబ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్‌తో ప్రేక్షకుల్లో మరింత భారీ అంచనాలకు పెంచేస్తుంది. ఈ ఐదవ సింగిల్ ప్రోమో రిలీజైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. పూర్తి సాంగ్‌ను ఆగస్టు 26 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Social Media లో ఆ నటిని వేధించిన Ananya Panday.. తప్పు ఒప్పుకుంది..

Advertisement

Next Story