- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mega Star నే వ్యతిరేకించిన Pawan Kalyan.. ఆ విషయంలో నచ్చలేదంటూ విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 68 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు చిరంజీవికి కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం తన అన్నయ్యకు విషెస్ తెలిపారు. ‘‘‘అన్నయ్య చిరంజీవికి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతి నిజాయితీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం’’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ గతంలో తన అన్నయ్య చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
అయితే.. 2009లో చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. అంతే కాకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. అప్పుడు పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీకి యువజన అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే, కొన్ని అనివార్య కారణాల చేత చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అది పవన్ కల్యాణ్‌కు నచ్చలేదు. దీంతో చిరంజీవిపై సీరియస్ అయ్యారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు అప్పట్లో చిరంజీవిని ఇరుకున పెట్టాయి. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. పవన్‌కు ఆవేశం ఎక్కువ. వాడిది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటూ కొట్టిపారేశారు చిరంజీవి. కాగా.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Akira Nandan ను ఇంట్రడ్యూజ్ చేయనున్న Raghavendra Rao.. క్లారిటీ ఇచ్చిన Renu Desai
చిరంజీవి భార్య సురేఖ, నటి రాశికి మధ్య రిలేషన్ ఏంటో తెలుసా?
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'మెగా 157' పోస్టర్ ను విడుదల చేసిన UV క్రియేషన్స్