సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ!

by Jakkula Samataha |   ( Updated:2024-06-15 06:06:39.0  )
సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ!
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పది సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని, చివరకు సక్సెస్ అయ్యారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో సినిమాల నుంచి తప్పుకోనున్నారు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యాడు. అంతే కాకుండా గ్రామీణ అభివృద్ధి, అటవీ, సైన్స్, రూరల్ వాటర్ లాంటి శాఖలకు మినిస్టర్‌గా ఉన్నారు. దీంతో ఈయన వీటిపై పట్టు సాధించడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా ఆయన రాష్ట్రం కోసం , ప్రజల కోసం చాలా చేయాలి. ఇలాంటి టైమ్‌లో ఆయన తాను సినిమాలకు గుడ్ బై చెప్తారంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కాగా, తాజాగా ఈ ప్రశ్ననే మెగా డాటర్ సుష్మిత కొణిదెలకు ఎదురైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోతున్నారుగా, ఆయన ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలు ఎలాగో పూర్తి చేస్తారు. మరి తదుపరి సినిమాకు సైన్ చేస్తారా? లేకా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు.

దీనికి ఆమె సమాధానం చెప్తూ.. పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్పితే సినిమాలకు గుడ్ బై చెప్పరు. ఆయన మూవీస్ తీయడం ఆపేస్తే తన ఫ్యాన్స్‌కు అది గుండె పగిలే వార్తే అవుద్ది, ఎన్నో అవమానాల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం హోదాలోకి వచ్చారు. ఇప్పుడు తన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఏపీలో ఆయన చేసే మంచి పనులను చూసి తన అభిమానులు మురిసిపోవాలి అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed