- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ డైరెక్టర్ వల్ల పవన్ కల్యాణ్- రేణుదేశాయ్ విడిపోయారా? బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు తీన్‌మార్, భీమ్లా నయక్, అత్తారింటికి దారేది ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ‘భీమ్లా నాయక్’ సినిమా ఈవెంట్ విషయంలో వీరిద్దరి మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈవెంట్లకు రాకుండా తనను త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడని, కావాలనే తనను పిలవడం లేదని త్రివిక్రమ్ పై మండిపడ్డ గణేష్ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా, బండ్ల గణేష్ ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యకరమైన రిప్లై ఇచ్చాడు. గురూజీకి కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగ్గట్టు మళ్లీ కథను మార్చి.. అసలు అనుకున్న కథను షెడ్డుకు పంపిస్తాడంట కదా? అని అడిగాడు ఓ నెటిజన్. దానికి బండ్ల గణేష్ ఇచ్చిన సమాధానం.. ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడని, అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ కౌంటర్లు వేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ విడాకుల వ్యవహారం వెనుక కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు.
Also Read..