షారుఖ్ కన్నా ఎక్కువ ఇస్తామన్న అందుకు ఒప్పుకోలేదు.. అదిరా మా పవన్ కళ్యాణ్ అంటే..

by Dishafeatures3 |
షారుఖ్ కన్నా ఎక్కువ ఇస్తామన్న అందుకు ఒప్పుకోలేదు.. అదిరా మా పవన్ కళ్యాణ్ అంటే..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనం కోసం జనసేనానిగా మారాడు. ప్రజల నేతగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈసారి ఏదేమైనా గెలుపు గుర్రం మనదే అంటున్నాడు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కోలా బ్రాండ్ ప్రకటన చేయాలని షారుఖ్ ఖాన్ కన్నా ఎక్కువ మనీ ఆఫర్ చేసినా.. దాని వల్ల కలిగే నెగెటివ్ ఎఫెక్ట్స్ తెలిసి తిరస్కరించినట్లు చెప్పాడు. ఎంత ఇచ్చినా చేసేది లేదని స్పష్టం చేసినట్లు తెలిపాడు.

దీనిపై స్పందిస్తున్న పవన్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ' అదిరా మా పవన్ కళ్యాణ్ అంటే.. మనీ కోసం కాకుండా మనుషుల కోసం ఆలోచిస్తాడు ' అని అంటున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ అభిమానులు మాత్రం విమర్శలకు దిగారు. ఎలక్షన్ టైంలో ఇలాంటివి చాలా చెప్తావ్ కానీ నీ మాటలు నమ్మేందుకు ఎవరూ రెడీగా లేరిక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఎన్నికల స్టంట్లు పక్కన పెట్టి ఏసీలో పడుకో.. ఇవన్నీ నీకు కరెక్ట్ కాదు.. నువ్వు గెలవలేవు కూడా ' అని విమర్శించారు.

Next Story