PKSDT: పవన్ కల్యాణ్ సినిమా విడుదల తేదీ ప్రకటన

by GSrikanth |   ( Updated:2023-04-10 11:17:49.0  )
PKSDT: పవన్ కల్యాణ్ సినిమా విడుదల తేదీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఏకంగా విడుదల తేదీని ప్రకటించి ఫ్యాన్స్‌కు అనూహ్య సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న సినిమాను విడుదల చేస్తున్నట్లు శుక్రవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇప్పటికే ప్రారంభమైన చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. కాగా, చిత్ర షూటింగ్‌ నుంచి లీకైన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుక్స్‌ పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అంచనాలు పెంచేశాయి. దీంతో థియేటర్స్‌లో తమ అభిమాన నటుడ్ని చూసుకోవడానికి ఆగలేకపోతున్నామంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

Advertisement

Next Story