- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కర్ణుడి పాత్రలో పవన్ కల్యాణ్.. ‘మహాభారతం’పై యంగ్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసమైన మహాభారతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహాభారతానికి సంబంధించిన అనేక తెలుగు సినిమాలు మనం ఇప్పటికే చూశాం. భారతదేశ దిగ్గజ దర్శకులు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతమే. మహాభారతాన్ని సినిమాగా తీస్తే ఏ క్యారెక్టర్‌లో ఎవరిని పెట్టాలో ఇప్పటికే రాజమౌళి కూడా ఓ అంచనాకు వచ్చారు. తాజాగా.. ‘హనుమాన్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మీరు మహాభారతాన్ని సినిమాగా తీస్తే.. అందులో కర్ణుడి పాత్రకు ఎవరిని ఎంపిక చేసుకుంటారని యాంకర్ ప్రశాంత్ వర్మను అడుగుతారు. దానికి ప్రశాంత్ వర్మ ఏమాత్రం ఆలోచించకుండా.. పవన్ కల్యాణ్ అని చెప్పేస్తారు. దానికి యాంకర్ కూడా పర్‌ఫెక్ట్ అని చెబుతారు. దీంతో ఈ వీడియోను గమనించిన పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు. మా హీరోకు పర్‌ఫెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.