Pawan Kalyan అభిమానులకు సూపర్ న్యూస్

by samatah |   ( Updated:2023-01-07 03:46:40.0  )
Pawan Kalyan  అభిమానులకు సూపర్ న్యూస్
X

సినిమా : రీ-రిలీజ్ సినిమాలతో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్న పవన్ కల్యాణ్‌ అభిమానులకు మరో సూపర్ న్యూస్ వచ్చేసింది. పూరి జగన్నాథ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ వచ్చిన సెన్సేషనల్ మూవీ బద్రిని థియేటర్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే తమ్ముడు, జల్సా, ఖుషీ రీరిలీజ్ సినిమాలతో కలెక్షన్ల మోత మోగించిన అభిమానులు మరో కిర్రాక్‌ మూవీని థియేటర్‌లో చూసేందుకు ఆగలేకపోతున్నామంటున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున(జనవరి 26) బద్రి సినిమాను థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఇక ఈ సినిమా ఏవిధమైన కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి మరి.

Also Read...

సమంత 'శాకుంతలం' ట్రైలర్ రిలీజ్‌ డేట్ ఖరారు

Advertisement

Next Story