Trending: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన పవన్ కళ్యాణ్.. బాబాయ్ అబ్బాయ్ ఒక్క చోటే..

by Sujitha Rachapalli |
Trending:  అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన పవన్ కళ్యాణ్.. బాబాయ్ అబ్బాయ్ ఒక్క చోటే..
X

దిశ, సినిమా : అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్లికి దేశ వ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. సినిమా స్టార్స్, క్రికెటర్లు, వ్యాపారస్తులతోపాటు రాజకీయ నాయకులు అటెండ్ అయ్యారు. మ్యారేజ్ తర్వాత జరిగిన శుభ ఆశీర్వాద్ ఉత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరై ఆశీర్వాదం అందించారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకాగా.. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు. వీరితోపాటు రామ్ చరణ్, ఉపాసన కూడా కనిపించారు.

కాగా ప్రస్తుతం నేషనల్ మీడియాలో జనసేనాని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో నుదుటన కుంకుమతో కనిపించిన ఆయనను చూసి రియల్ హీరో అని పొగిడేస్తున్నారు అభిమానులు. ఇంత సింపుల్ గా ఉన్నా రాజసం ఉట్టి పడుతుందని మురిసిపోతున్నారు. నార్త్ ఇండియన్స్ సైతం ఆయన లుక్ కు ఫిదా కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి.


Advertisement

Next Story