పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ గా.. రోజా హీరోయిన్ గా చేసిన సినిమా ఏంటో తెలుసా

by Prasanna |   ( Updated:2024-07-02 12:57:53.0  )
పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ గా.. రోజా హీరోయిన్ గా చేసిన సినిమా ఏంటో తెలుసా
X

దిశ, సినిమా : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లోకి వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి కొందరు మంత్రులు వచ్చారు. దివంగత కృష్ణంరాజు, చిరంజీవి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. బాబు మోహన్, రోజా కూడా మంత్రి పదవులు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కేబినెట్‌లో రోజా టూరిజం మంత్రిగా పనిచేశారు.

హీరో కాకముందు పవన్ కళ్యాణ్ అంజనా ప్రొడక్షన్స్ సహా నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్, ముగ్గురు మొనగాళ్లు మూవీని నిర్మించారు. ఈ మూవీలో చిరంజీవి తొలిసారి మూడు పాత్రలు పోషించారు. రోజా, రమ్యకృష్ణ, నగ్మా ప్రధాన పాత్రలు పోషించారు. అలా రోజా హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ గా పని చేసారు.

కానీ, ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ 1996లో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌ పతాకం పై ఇవివి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.

Advertisement

Next Story