- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్, నేను.. ఇద్దరం ఒక్కటే : బాలకృష్ణ
దిశ, సినిమా: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలయ్య తాజాగా అక్కడ పర్యటించాడు. అయితే తెలుగుదేశం పార్టీతో, జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపురం వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ.. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ వైరల్ కామెంట్స్ చేశాడు.
‘పవన్ కల్యాణ్, నేను ఇద్దరం కూడా ఒకే వ్యక్తిత్వం కలవారం. మా ఇద్దరిలో ఒకే విధమైన లక్షణాలు చాలా ఉన్నాయి. ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం మాది. ఎవరికి భయపడం. అవినీతి అరాచక పాలనకు పాల్పడే వారిని లెక్క చేయం. ఇటువంటి లక్షణాలు పవన్‌లో, నాలో చాలా ఉన్నాయి’ అని తెలిపాడు. ఇక పవన్ కల్యాణ్ గురించి బాలయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.