గబ్బర్ సింగ్ మూవీ చేయడం పవన్‌కు ఇష్టం లేదా.. ఇన్ని రోజులకు బయటపడిన నిజం!

by Jakkula Samataha |   ( Updated:2024-05-11 14:40:39.0  )
గబ్బర్ సింగ్ మూవీ చేయడం పవన్‌కు ఇష్టం లేదా.. ఇన్ని రోజులకు బయటపడిన నిజం!
X

దిశ, సినిమా : జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరు చెబితేనే యూత్‌లో ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. ఇక ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఇక ఆయన సినిమాల్లో చాలా మందికి, గబ్బర్ సింగ్ సినిమా అంటే ఇష్టం ఉంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ రోజుల్లో ఇది ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.

కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా? అయితే పవన్ కళ్యాణ్ మూవీలో నటించడానికి మొదటగా, పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదంట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దబాంగ్ రీమేక్ మీరు చేస్తే బాగుంటుందని అడిగారు.. ఇక ఈ మూవీ నేను ఒకసారి చూశాను, ఆ తర్వాత అందులో నేను ఎలా నటించాలో నాకు అర్థం కాలేదు అని చెప్పుకొచ్చారు.

కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ఎందుకో మళ్లీ గుర్తు వచ్చింది. అప్పుడు నేను డైరెక్టర్‌కు ఫోన్ చేసి, సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాను. గుడుంబా శంకర్ సినిమాలో ఓ సన్నివేశాన్ని పూర్తిగా తీసుకొని ఆ సినిమాలో పోలీస్ రోల్ చేశాను. ఇక ఆ తర్వాత సినిమా రెస్పాన్స్ చూసి చాలా షాక్ అయ్యాను. చాలా హాప్పి గా అనిపించిదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్స్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ సినిమా చేయడం మొదట్లో ఇష్టం లేదా అంటూ షాక్ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న విషయం తెలిసిందే. ఎలెక్షన్స్ తర్వాత ఆయన సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం.

Read More...

పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ.. ఎమోషనల్ ట్వీట్ పెట్టిన శ్రీలీల.. ఏమన్నదంటే!

Advertisement

Next Story

Most Viewed