Hero Prabhas: పెద్ద సాహసం చేయనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. గెలవగలడా?

by Prasanna |   ( Updated:2024-08-10 06:10:05.0  )
Hero Prabhas: పెద్ద సాహసం చేయనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. గెలవగలడా?
X

దిశ, సినిమా : ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి సంచలన కామెంట్స్ చేసాడు. కానీ, అతని చెప్పిన దానికి మొత్తం రివర్స్ లోనే జరుగుతుంది. కష్టపడి పని చేసే వాడికి జాతకాలతో అవసరం లేదంటూ ప్రభాస్ నిరూపించాడు. సలార్ మూవీ హిట్ అవ్వదని అనేక ఇంటర్వ్యూల్లో జ్యోతిష్యులు చెప్పారు కానీ ఆ మూవీ డార్లింగ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా అయితే ఏకంగా రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ప్రభాస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇప్పటి నుంచి ప్రభాస్ తీసే ఏ సినిమా అయినా సరే భారీ అంచనాలే ఉంటాయి. ఎందుకంటే ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. దీంతో ఫ్యాన్స్ కూడా పాన్‌ ఇండియా సినిమాలే కోరుకుంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇండియా సీక్వెల్స్‌, పాన్‌ ఇండియా సినిమాలు పక్కన పెట్టి టాలీవుడ్‌ సినిమాలు ఎక్కువ సమయం ఇస్తున్నట్టు తెలుస్తుంది.

2025 వచ్చే సమ్మర్‌లో ‘రాజాసాబ్‌’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న మూవీ కూడా మొదలవుతుందని అంటున్నారు. పైగా ఈ రెండు సినిమాల షూటింగ్ పారలల్‌గా జరుగుతాయని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇదే నిజమైతే వచ్చే ఏడాది రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతాయి. మరి ఇవి హిట్ అవుతాయో.. లేదో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed