- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: ఛత్రపతి సినిమాలోని ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టిన ప్రభాస్
దిశ, వెబ్‌డెస్క్: బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ మధ్యన ఆదిపురుష్, రాధే శ్యామ్ వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ దర్శక, నిర్మాతల్ని ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశారు. మళ్లీ ప్రభాస్ ఫామ్‌లోకి వచ్చాడు. సలార్, కల్కి 2898 చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ఢిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులందర్ని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు.
అయితే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛత్రపతి’ సినిమాలోని ఓ ఆసక్తికర విషయాన్ని ప్రభాస్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘కెరీర్ స్టార్టింగ్‌లో మైక్ పట్టుకోవడానికి కూడా తడబడేవాడిని. ఛత్రపతి సినిమా షూటింగ్‌లోనూ చాలా ఇబ్బందిపడ్డాను. ఆ మూవీలో బాజీరావును చంపేసిన ఓ సీన్ ఉంటుంది. ఆయన్ను చంపి, శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడుకు హీరో వార్నింగ్ ఇవ్వాలి. అప్పుడు నేను సెట్‌లో డైలాగ్ చెప్పలేదు. జస్ట్ పెదవులు కదిపాను. డైలాగ్ సైలెంట్‌గా చెబుతానని జక్కన్నతో చెప్పాను.
ఓకే అన్నాడు. నేను కేవలం పెదాలు మాత్రమే ఆడిస్తూ డైలాగ్ చెబుతుంటే అక్కడున్నవారికి నేను ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఎందుకో నాకే తెలియదు చుట్టూ జనాలు ఉంటే సైలెంట్ అయిపోతాను. మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ అప్పుడు కూడా ఇలాగే అయ్యింది. మరీ అంతలా సిగ్గుపడితే ఎలా? అంటూ నాతో పనిచేసిన డైరెక్టర్స్ అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు. ఆయన వల్లే నువ్వు ఇలా చెబుతున్నావు అని.’ అంటూ ప్రభాస్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.