- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బిగ్‌బాస్’ షోలో షాకింగ్ ఘటన.. రతికపై చెయ్యి చేసుకున్న పల్లవి ప్రశాంత్
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో రతిక- పల్లవి ప్రశాంత్ మధ్య జరుగుతున్న క్లోజ్‌నెస్ చూస్తూనే ఉన్నాం. కానీ రతిక.. రైతు బిడ్డతో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఒక్కోసారి ప్రశాంత్‌తో కావాలని కెలిగించుకొని మరీ లొల్లి పెట్టుకుంటుంది. అసలు వీరు ఎందుకు గొడవ పడుతారో, ఎందుకు దూషించుకుంటారో ఎవ్వరికి అర్థం కాదు. అయితే తాజాగా హౌస్‌లో మూడో వారంలో ఇమ్యూనిటీ పొందుకోవడం కోసం.. నేరుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్‌లను ఎంపిక చేశారు. అయితే వాళ్లు పవరాస్త్ర పొందుకోవడానికి అర్హులో కాదో.. కన్ఫెషన్ రూంకు పిలిచి, ఇంటి సభ్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాళ్లు ఏ కారణాలు అయితే చెప్పారో.. వాటిని బిగ్ బాస్ తిరిగి వినిపించారు.
ఇక పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ తనని ఎంపిక చేయకపోవడం వల్ల తెగ ఫీల్ అయ్యాడు. బిగ్ బాస్ మనసులో ఓడిపోయానంటూ ఏడవడం మొదలు పెట్టాడు. ఆ తరువాత ఒక్కొక్కరు.. నామినేషన్స్‌లో మాదిరే ఏదో ఒక కారణాలు చెప్పారు. దామిని ఏదో మాస్టర్ మైండ్స్ అన్నట్టుగా.. ప్రిన్స్‌కి ప్రిన్స్ లేదని.. చెప్పి అనర్హుడిగా ప్రకటిస్తుంది. ఇక ఈ క్రమంలో రతిక.. ప్రశాంత్ మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ‘నీకు ఎన్ని సార్లు చెప్పినా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని రతికా రోజ్ అనగా.. నువ్వే పో అంటూ ప్రశాంత్ ఆమెను చేత్తో తాకి చెప్పే ప్రయత్నం చేశాడు. చెయ్యేస్తే బాగోదని అతడికి రతికా వార్నింగ్ ఇచ్చింది.’ కాసేపు అతనితో మంచిగా ఉంటున్న రతిక మరి కాసేపట్లో రివర్స్ అవుతుంది. కాగా రతికా రోజ్ ప్రవర్తన అంతుబట్టడం లేదు.