హీరో కాదు విలన్.. 'పక్కా కమర్షియల్‌'గా గోపిచంద్ ట్రైలర్

by Sathputhe Rajesh |
హీరో కాదు విలన్.. పక్కా కమర్షియల్‌గా గోపిచంద్ ట్రైలర్
X

దిశ, సినిమా : హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో రూపొందిన 'పక్కా కమర్షియల్' చిత్రం జులై 1న రిలీజ్ కానుంది. కాగా గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. 'సెల్యూట్ కొట్టించుకునేందుకు నేను హీరో కాదు విలన్' అంటూ క్లాస్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించాడు గోపి. ప్రేమ, వినోదంతో పాటు తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించిన ట్రైలర్‌లో లాయర్‌గా గోపిచంద్, జూనియర్ లాయర్‌గా రాశీఖన్నా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇక చివరలో గోపి, సత్యరాజ్ కోర్టు హాలులో ప్రత్యర్థి లాయర్లుగా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. గ‌తేడాది ద‌స‌రా సందర్భంగానే ఈ సినిమా విడుద‌ల‌ కావాల్సి ఉన్నప్పటికీ క‌రోనా కార‌ణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత సరైన తేదీ కోసం ఇన్నాళ్లూ వేచి చూసిన మూవీ టీమ్.. ప్రస్తుతం గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది.

Advertisement

Next Story

Most Viewed