ఆడ పిల్లలను స్కూల్ కు పంపిస్తే చెడిపోతారు.. సింగర్ షాకింగ్ కామెంట్స్

by Sujitha Rachapalli |
ఆడ పిల్లలను స్కూల్ కు పంపిస్తే చెడిపోతారు.. సింగర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పాకిస్థానీ సింగర్ హసీఫ్ హజాన్ ఇక్బాల్ చిస్టి కొత్తగా ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. ఇందులో అమ్మాయిలు స్కూల్ కి వెళ్తే చెడిపోతున్నారని, గౌరవాన్ని పోగొడుతున్నారని సంచలన కామెంట్స్ చేశాడు. ఆడ పిల్లలను వెంటనే స్కూల్ మాన్పించాలని సూచించాడు. ఎందుకంటే పాఠశాలకు వెళ్లిన వారు డ్యాన్స్ చేస్తూ కనిపించారని.. అదే కంటిన్యూ చేస్తే వేశ్యలుగా మారే అవకాశం ఉందని పాటలో యాడ్ చేశాడు. మీ కుటుంబ పరువు కాపాడుకోవాలంటే అమ్మాయిలను పరద కింద ఇంట్లోనే దాచాలని చెప్పుకొచ్చాడు. ఇదే సరైన పద్ధతి అని హితబోధ చేస్తున్నాడు.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఒక సింగర్ కు ఉండాల్సిన లక్షణం ఇదేనా అని తిట్టిపోస్తున్నారు. సమాజం బాగుపడేందుకు అవగాహన కల్పించాల్సింది పోయి ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నాడెంటని షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈయన స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎందుకు చూశాడని, అసలు అటు వైపు వెళ్లాల్సిన అవసరం ఈయనకు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆడ పిల్లలను కాదు ముందు తనను ఇంటి నుంచి బయటకు రానివ్వొద్దు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed