వేణు స్వామి ఆరోపణలపై స్పందించిన జర్నలిస్ట్ మూర్తి.. నిజమైతే నన్ను కొట్టి చంపండి అంటూ సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-08-20 15:18:22.0  )
వేణు స్వామి ఆరోపణలపై స్పందించిన జర్నలిస్ట్ మూర్తి.. నిజమైతే నన్ను కొట్టి చంపండి అంటూ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, ఆయన భార్య సింగర్ వీణా శ్రీవాణి అందరికీ సుపరిచితమే. వీరిద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంటారు. అయితే తాజాగా, వేణు స్వామి, అతని భార్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో విడుదల చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ వీడియోలో భాగంగా ‘‘ నన్ను ప్రముఖ జర్నలిస్ట్ బెదిరిస్తున్నాడు. 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు నేను వాళ్ళు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు.

అందుకే చాలా రోజుల తర్వాత.. గత 8 నెలల నుంచి ఆయన ఆధ్వర్యంలో వాళ్ల టీమ్ ముందు నా మీద దాడులు చేశారు. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లైంట్స్ రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చారు. నా గురించి టీవీల్లో డిబేట్ కూడా పెట్టి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు ప్రముఖ జర్నలిస్ట్ చేస్తున్నారు. ఎంతోమందిని నేను కష్టాల నుంచి బాధల నుంచి బయటపడేలా చేశాను. నాకు చివరకు నేనే ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లాను. 8 నెలల నుండి 15 కేజీల బరువు కూడా తగ్గిపోయాను. దీనంతటికీ జర్నలిస్ట్ మూర్తి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా దీనిపై జర్నలిస్ట్ మూర్తి స్పందిస్తూ ఓ విడియో రిలీజ్ చేశారు.. ఇందులో భాగంగా.. తాను వేణుస్వామిని రూ. 5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. నా 30 ఏళ్ల జర్నలిజంలో నేను వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్లని నా జీతభత్యాల విషయంలో నాకు ఇంత కావాలని అడుగుతా.. కానీ, బయట ఎవరి దగ్గర కాఫీ, టీలు కూడా తాగలేదు.. వారి దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఒకవేళ నేను వేణు స్వామి దగ్గర రూ. 5 కోట్లు అడిగాను అని ప్రూఫ్ అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. ఇప్పుడు కాదు ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అయినా మీ పరిశోధనలో తేలితే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉండే నా ఎముకలకు జర్నలిస్ట్ మూర్తి ద్రోహి అని బోర్డు తగిలించండి అంటూ వాపోయారు. సాక్ష్యం లేకపోతే వేణు స్వామి ఫ్యామిలీని పరామర్శించి ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండి. ఉమ్మడి APలో గవర్నర్ ND తివారి స్టోరీని బయట పెట్టింది నేనే. అలాంటి హై ప్రొఫైల్ కేసులోనే డబ్బులకు లొంగని నేను నిన్ను అడుగుతానా అంటూ జర్నలిస్ట్ మూర్తి వేణు స్వామి పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దుమ్ము దుమారం రేపుతోంది.

Read More..

Venu Swamy: అతను వేధిస్తున్నాడు దయచేసి మా జీవితాలను కాపాడండి.. వేణు స్వామి దంపతుల సంచలన వీడియో


( video link credits to tv5 youtube channel)

Advertisement

Next Story