- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓరి నాయనో.. వివాదాల జ్యోతిష్యుడు వేణు స్వామికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే కళ్లు బయర్లు కమ్మాల్సిందే
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. నటీనటుల పెళ్లి విషయంలో వారి జాతకాలను చూసి వీరికి పెళ్లి అచ్చు రాదు.. విడాకులు తీసుకుంటారు అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని బిగ్‌బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అలా ఈయన చెప్పిన తర్వాత వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం అతని వద్దకు వచ్చి జాతకాలను చెప్పించుకుంటున్నారు. కానీ, ఏపీ ఎలక్షన్ టైం లో మళ్లీ జగన్ గెలుస్తాడని కూటమి అధికారంలోకి రాదని.. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పాడు. అయితే అతను చెప్పినట్టు కాకుండా ఈ సారీ ఏపీలో కూటమి గెలిచింది. దీంతో తప్పుడు జాతకం చెప్పినందుకు క్షమించమని, ఇప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పనని బహిరంగంగా వారి గురించి ఏ విషయాలను చెప్పనంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
కాగా తాజాగా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే వీరి వైవాహిక జీవితం పై సంచలన కామెంట్స్ చేశాడు. అందులో భాగంగా సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరిద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. కాగా తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఆయన జ్యోతిష్యంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇంతమంది జాతకాలను చెప్తున్న వేణు స్వామి.. సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తన ఆస్తి గురించి చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా ఒక వైన్ షాప్, ఒక పబ్, రేంజ్ రోవర్ కార్, ఇంకా ఇతర వ్యాపారాలు చాలానే ఉన్నాయిని చెప్పాడు. అలా తన బిజినెస్‌ల నుంచి వచ్చే ఆదాయం నెలకు లక్షల్లోనే ఉంటుందని సమాచారం. మొత్తంగా ఇప్పటివరకు ఆయన సంపాదించిన ఆస్తులు రూ.10 కోట్లకు పైనే ఉంటాయని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
Read More..
Jr. NTR: జూ.ఎన్టీఆర్ కు గాయం నిజమే.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్