సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్.. కానీ ఓ ట్విస్ట్!

by Jakkula Samataha |
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్.. కానీ ఓ ట్విస్ట్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం ఓటీటీ హవా కొనసాగుతోంది. ఎప్పుడెప్పుడు తమకు నచ్చిన హీరో, హీరోయిన్స్ మూవీస్ ఓటీటీలోకి వస్తాయా అని సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కాగా, తాజాగా వరుణ్ తేజ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో వరుణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్‌గా నటించిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. పుల్వామా ఎటాక్‌తో పాటు సర్జికల్ స్ట్రైక్ బ్యాక్ డ్రాప్‌లో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ,మార్చి1న థియేటర్లలో రిలీజై డిజాస్టర్‌గా మిగిలింది. కాగా, తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఎలాంటి సమాచారం లేకుండా డైరెక్ట్‌గా శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా చూడాలంటే? సినీ ప్రియులకు ఓ చిన్న ట్విస్ట్ పెట్టారు. అది ఏమిటంటే? థియేటర్లలో రిలీజైన 22రోజులకే ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీలోకి రావడంతో, ఈ సినిమాను చూడాలంటే, అమెజాన్ ప్రైమ్‌, స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు అద‌నంగా 279 రూపాయ‌లు చెల్లించాల్సివుంటుంది.

Advertisement

Next Story