- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వార్త.. మరింత అసభ్యకరంగా మరోసారి రష్మిక డీప్ ఫేక్ వీడియో
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్‌ను సెట్ చేసి నెట్టింట షేర్ చేశారు. దీనిపై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోను చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రష్మిక కూడా సీరియస్ అయ్యింది. అయితే.. రష్మికతో ఆగిపోని వీడియోలు తర్వాత చాలా మంది బాలీవుడ్ స్టార్స్‌ను సైతం టార్గెట్ చేశాయి. అలియా భట్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే.. ఇప్పుడు మరోసారి రష్మిక వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. ఈసారి మరింత అసభ్యకరంగా ఉన్న వీడియోకి రష్మిక ఫేస్‌ను సెట్ చేసి నెట్టింట షేర్ చేశారు. ఓ అమ్మాయి బికినీలో ఉన్న రష్మిక ఫేస్‌ను ఎడిట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా ఉంటాయి అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో, దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. రష్మిక వీడియోను ‘డానీలావిల్లార్రియల్_ఎ’ అనే అమ్మాయి వీడియోతో డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.