Allari Naresh: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. సితార బ్యానర్‌పై అల్లరి నరేష్ కొత్త సినిమా

by sudharani |
Allari Naresh: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. సితార బ్యానర్‌పై అల్లరి నరేష్ కొత్త సినిమా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హాస్య నటుడుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు అల్లరి నరేష్. ఈయన మూవీ వస్తుందంటే చాలు థియేటర్లు నవ్వులతో నిండిపోయేవి. అలాంటిది ఇప్పుడు నరేష్ వైవిధ్యభరితమైన చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ హీరోలో ఉన్న మరో యాంగిల్‌ను బయట పెడుతూ.. సీరియస్ యాక్షన్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈయన త్వరలో ‘బచ్చల మల్లి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే నరేష్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘ప్రొడక్షన్ నెం.29’ గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. అప్పుడు విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు చిత్రబృందం అధికారికంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈరోజు (జూలై 27)న పూజా కార్యక్రమాలతో మూవీని ప్రారంభించారు. ఫ్యామిలీ డ్రామా చిత్రంతో ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన అండ్ దర్శకత్వం వహిస్తున్నారు. వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీ రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.

Advertisement

Next Story