- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: నారాయణ హృదయాలయ ఆసుపత్రికి NTR.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా బ్రహ్మిణీ బెంగుళూరుకి చేరుకున్నారు. గుండెపోటుకు గురై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకరత్నను చూసేందుకు నేరుగా హాస్పటల్‌కి వెళ్లారు. తారకరత్నను పరామర్శించిన అనంతరం వైద్యులతో మాట్లాడిన తారక్.. సోదరుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హార్ట్ స్ట్రోక్‌తో పాటు మెలెనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రక్త ప్రసరణ నాళాల్లో బ్లాక్స్ ఉండటం వల్ల శరీర భాగాలకు రక్తం ప్రసరణ జరగడం లేదని.. దీంతో ఎక్మో ద్వారా ట్రీట్ ఇస్తున్నట్లు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. మెలెనా అనే వ్యాధి వల్ల చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతోందని.. దీంతో యోంజియోప్లాస్టీ ద్వారా తారకరత్నకు బ్లడ్ పంపింగ్ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉండటంతో నందమూరి, నారా కుటుంబ సభ్యులు బెంగుళూర్‌కి చేరుకుంటున్నారు.